Banner
Watermark
బీఆర్‌ఎస్‌ దెబ్బకు రేవంత్‌రెడ్డి ఎన్నికలంటెనే వణుకుతున్నడు : హరీశ్‌రావు
📅 24 December 2025, 09:34 PM ✍️ admin
News Image
నర్సాపూర్‌ : సర్పంచ్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ దెబ్బకు సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలంటేనే గడగడ వణుకుతున్నడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నర్సపూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌లు, వార్డు మెంబర్‌ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గెలిచిన వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. రేవంత్‌రెడ్డిని ఏకిపారేశారు.ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘సర్పంచ్‌ ఎన్నికల్లో గెలిచిన వారికి నా పక్షాన, బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, అద్భుతమైన గెలుపు. ఓటమి భయంతో రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం దక్కలేదు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయరు. కానీ ఓడిపోతామనే భయంతో రేవంత్‌రెడ్డి ఊరూరు తిరిగిండు. ‘అందిరికీ బతుకమ్మ చీరలు ఇచ్చిన, ఆ చీరలు కట్టుకుని వచ్చి కాంగ్రెపోళ్లకు ఓటేయాలె’ చిల్లర మాటలు మాట్లాడిండు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ భంగపడింది. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి 90 శాతం, వీలైతే 100 శాతం విజయాలు దక్కాలి. కానీ కాంగ్రెస్‌కు 64 శాతం ఫలితాలే వచ్చాయి. కాంగ్రెస్‌ 6 వేల సర్పంచ్‌ పదవులు గెలిస్తే, బీఆర్‌ఎస్‌ 4 వేల సర్పంచ్‌ పదవులు గెలుచుకుంది’ అన్నారు.
🏠 Home