Banner
Watermark
ఎస్‌పీఎల్ సీజన్–5 విజేతగా బుల్స్ జట్టు
📅 04 January 2026, 11:11 PM ✍️ Editor
News Image
ఫైనల్ మ్యాచ్‌కు మేడ్చల్ సీఐ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు

మేడ్చల్ జిల్లా శ్రీరంగవరం ప్రీమియర్ లీగ్ (ఎస్‌పీఎల్) సీజన్–5 క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. 2025 అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొని పోటీపడ్డాయి.

ఈ టోర్నమెంట్‌ను బీసీసీఎస్ చైర్మన్ ఏ. చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీసీఎస్ బోర్డు సభ్యులు సమర్థవంతంగా నిర్వహించారు. ఫైనల్ మ్యాచ్‌లో బుల్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలువగా, వరం వారియర్స్ జట్టు రన్నర్స్‌అప్‌గా నిలిచింది.

ఫైనల్ మ్యాచ్‌కు మేడ్చల్ సీఐ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై విజేతలు మరియు రన్నర్స్‌అప్ జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన అభినందించి, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా ఇలాంటి టోర్నమెంట్‌లు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు.

ఈ టోర్నమెంట్‌కు జే. భూపాల్, జి. కృష్ణ, పోచయ్య (మాజీ సర్పంచ్), ఎం. నరసింహ, దేవేంద్ర రెడ్డి, చందర్ (మాజీ సర్పంచ్), భాను చందర్, రమేష్ (పోలీస్), నరేష్, కొండల్ రెడ్డి స్పాన్సర్లుగా వ్యవహరించి తమ సహకారం అందించారు.
🏠 Home