వక్త 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయండివక్త 2026 పోస్టర్ల ఆవిష్కరణ
📅 29 January 2026, 11:56 AM
✍️ admin
ఉదయగిరి జనవరి 29 (వార్త పత్రిక ప్రతినిధి )
జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 37 సంవత్సరాల నుండి విద్య వైద్యం ఆరోగ్యం పర్యావరణం వ్యవసాయం మహిళ సాధికారిక మొదలగు విభిన్న రంగాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందింది. విద్యార్థినీ విద్యార్థులు ప్రస్తుతం విద్యాబుద్ధులతో పాటు చక్కగా మాట్లాడగలగడం మారుతున్న ప్రపంచ మానవ వనరుల అవసరాలలో అత్యంత ఆవశ్యకత ఉంది. అందుకే వక్త అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. వక్త అంటే బాగా మాట్లాడగలిగేవాడు బాగా ప్రసంగించేవాడు అని అర్థం. తక్కువ సమయంలో సులువుగా స్పష్టంగా విషయాన్ని చెప్పగలిగేలా తీర్చిదిద్దడం ఈ పోటీల ఉద్దేశం . విద్యార్థికి చక్కగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉంటే ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ రంగంలోనైనా రాణించగలరు . విద్యార్థుల భవితకై నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్ లు మీ పాఠశాలలో కళాశాలలో ఈ పోటీలను నిర్వహించడానికి తోడ్బాటు అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా వక్త 2026 పోస్టర్లను మండల విద్యావనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారి 2 తోట శ్రీనివాసరావు , వేణు నర్సింగ్ హోమ్ అధినేత ఉదయగిరి జిల్లా సాధన కమిటీ అధ్యక్షులు డాక్టర్ కడియాల వేణుగోపాల్ , జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్ మండల జనవిజ్ఞాన వేదిక అధ్యక్షులు గాజుల మున్నా మండల విద్యావంతుల కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్లు షేక్ అలీమ్ సి ఆర్ పి సిద్దయ్య ప్రధానోపాధ్యాయులు షేక్ షబ్బీర్,ఆవిష్కరించడం జరిగింది.