Banner
Watermark
మల్లికార్జునుడి సేవలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
📅 29 January 2026, 03:01 PM ✍️ Editor
News Image
చిన్న శ్రీశైలంలో ద్వాదశ జ్యోతిర్లింగ 25వ మహా పడిపూజ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

శివ స్వాములు, భక్తుల సౌకర్యార్థం వంటశాల–డైనింగ్ హాల్‌కు శంకుస్థాపన

వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, జనవరి29 : గాజుల రామారం డివిజన్ పరిధిలోని నల్లగుట్టలో ఉన్న ప్రసిద్ధ శ్రీ భ్రమరాంభ మల్లికార్జున దేవస్థానం (చిన్న శ్రీశైలం)లో నిర్వహించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ 25వ మహా పడిపూజ కార్యక్రమంలో భాగంగా వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై, ఫిబ్రవరి 1వ తేదీన నల్లగుట్ట శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ 25వ మహా పడిపూజ వాల్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.
అంతకుముందు ఎమ్మెల్యే శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేవాలయ ఆవరణలో భక్తులకు కల్పించాల్సిన మౌళిక వసతులపై ఆలయ కమిటీ సభ్యులు, శివ స్వాములు ఎమ్మెల్యే కి పలు సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ
భ్రమరాంభ మల్లికార్జున స్వామి కృపా కటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షించారు. 25 సంవత్సరాల క్రితం కొద్ది మంది శివ స్వాములతో గురుస్వామి, ఆలయ ధర్మకర్త దూదిమెట్ల సోమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన శివదీక్ష, నేడు 108 మంది స్వాములు దీక్ష తీసుకునే స్థాయికి ఎదగడం గర్వకారణమని తెలిపారు.
ఈ ఆలయం భక్తుల విశ్వాసంతో పాటు క్రమంగా అభివృద్ధి చెందుతూ ప్రాంతానికి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని, దేవాలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అనంతరం శివ స్వాములు, భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న వంటశాల, డైనింగ్ హాల్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ వసతులతో భవిష్యత్తులో జరిగే శివదీక్షలు, మహాపూజ కార్యక్రమాల్లో భక్తులకు మరింత సౌకర్యం కలగనుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శివ గురుస్వాములు పెంటయ్య, యాది లాల్, సురేష్ రెడ్డి, లవీర్ రెడ్డబోయిన, కృష్ణా రెడ్డి, యాదమ్మ, రాజు,
కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్,
శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్,
సీనియర్ నాయకులు అంజన్ గౌడ్, కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, తెలంగాణ సాయి, చెట్ల వెంకటేష్, తారా సింగ్, బోయిని మహేష్, ప్రభుదాస్, ప్రసాద్, శివా నాయక్, గౌస్‌తో పాటు పలువురు శివ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home