Banner
Watermark
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
📅 29 January 2026, 04:20 PM ✍️ Editor
News Image
తెలంగాణ రాష్ట్ర బీసీ కార్యదర్శి. కేటీఆర్ సేన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. జి విజయకుమార్

వార్త పత్రిక షాద్ నగర్ జనవరి29:రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కెసిఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది.ఇప్పటివరకు పోలీస్ అధికారుల దగ్గర ఎలాంటి సాక్షధారాలు లేకుండా కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం అనేది అనైతికమైనటువంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిపాలన పరాకాష్ట
మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని వేధింపులకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకునికి 10 సంవత్సరాల అద్భుతమైన ప్రజాపాలన చేసినటువంటి కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం అనేది సిగ్గుచేటు. మున్సిపల్ ఎలక్షన్లో జరుగుతుంటే ప్రతిపక్షాన్ని వేధింపులకు గురి చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల్లో మునిగిపోయింది. బెదిరించే కార్యక్రమం,యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి కాంగ్రెస్కు మీడియాను ప్రజలను పక్కదారి పట్టించడానికి జరుగుతున్న కుట్రలో ఇడి నోటీసులు.
🏠 Home