Banner
Watermark
స్వయం ఉపాధితోనే సమగ్ర అభివృద్ధి
📅 13 February 2026, 04:18 PM ✍️ M.Chinna
News Image
వార్తపత్రిక, కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 13: ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా నిరుద్యోగ యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద పిలుపునిచ్చారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులారామారం డివిజన్ ప్రాంతం దేవేందర్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన“తాజ్ బేకరి” షాపును ఎమ్మెల్యే కె.పి. వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వయం ఉపాధి ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజం మొత్తానికి ఆర్థిక బలం చేకూరుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా యువత వ్యాపార, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి వ్యాపారాలు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.
అనంతరం బేకరి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వినియోగదారులకు సరసమైన ధరలతో నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తూ వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కస్తూరి బాలరాజు, పాక్స్ చైర్మన్ పరుష శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ సాయి, మక్సూద్ భాయ్, చెట్ల వెంకటేష్, నాగేష్, సుంకరి చందు, తారా సింగ్, దాసరం లక్ష్మణ్, రాజు, జునైద్, శివ నాయక్, నవీన్, చందు గౌడ్, ఉపేందర్ రెడ్డి, సుంకరి శివ, లక్ష్మి, సంపంగి నరసింహతో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు
🏠 Home