కొంపల్లి డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో
పారిశుధ్యం పై దృష్టి పెట్టాలని కొంపల్లి ఉప కమిషనర్ని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ మరియు మాజీ ప్రెసిడెంట్ ఎస్సార్ నాయక్ నగర్ ఆలూరి వెంకట శేషాచారి
అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ ఆలూరి వెంకట శేషాచారి
ఈ రోజు కొంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఉప కమిషనర్ కృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్థానికంగా ఎస్సార్ నాయక్ గారితో పాటు పలు కాలనీలలో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని ఎస్సార్ నాయక్ నగర్ లో పారిశుధ్యం కుంటుపడిందని దీనిపై దృష్టి పెట్టాలని ఎక్కడకక్కడ చెత్తాచెదారం కొమ్మలు ఉండటం వల్ల కాలనీ నివాసులు ఇబ్బంది పడుతున్నారని సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ మరియు మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి సిబ్బందిని పెంచి కాలనీ పరిశుభ్రంగా ఉండేటట్టు చూడాలని మున్సిపల్ సిబ్బంది చాలావరకు మారిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా అధికారులు వ్యవహరించాలని పారిశుధ్యంపై దృష్టి పెట్టి గతంలో ఇచ్చిన జిహెచ్ఎంసి పార్కుకు సంబంధించి దృష్టి సారించాలని ఉప కమీషనర్ కృష్ణారెడ్డి గారిని కోరగా కొంత సమయం తీసుకుని ఆ యొక్క సమస్య పరిష్కరిస్తానని పారిశుధ్యం పై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వరరావు, గోవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు.