వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
📅 05 March 2026, 07:14 PM
✍️ M.Chinna
వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, మార్చి 5: ప్రపంచ ప్రసిద్ధ వీణా విద్వాంసురాలు వీణ శ్రీవాణి ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాద దంపతులు ఉప్పల అరుణా–అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సంగీత సాధన, భారతీయ శాస్త్రీయ సంగీత పరిరక్షణలో చేస్తున్న కృషిని అభినందించారు. భారతీయ సంప్రదాయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ వీణా వాద్యాన్ని కొత్త తరాలకు చేరువ చేస్తున్న శ్రీవాణి సేవలు ప్రశంసనీయం అని వారు పేర్కొన్నారు. యువతలో శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి పెంపొందించడంలో ఆమె చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవాణి తో సంగీతం, సంస్కృతి పరిరక్షణపై చర్చించిన న్యాయవాద దంపతులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.