Banner
Watermark
నార్వేలోని అమెరికా ఎంబసీ దగ్గర భారీ పేలుడు
📅 08 March 2026, 04:59 PM ✍️ M.Chinna
News Image
యూరప్‌ దేశం (Europe Country) నార్వే (Norway) లోని యూఎస్‌ ఎంబసీ (US embassy) వద్ద పేలుడు సంభవించింది. ఈ క్రమంలో భారీ శబ్దం వినిపించిందని, పెద్దఎత్తున పొగ వ్యాపించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగిందని అన్నారు. ఓస్లో (Oslo) నగరంలోని యూఎస్‌ ఎంబసీ ప్రవేశ ద్వారం వద్ద ఈ పేలుడు సంభవించిందని చెప్పారు.

ఈ పేలుడువల్ల స్వల్ప నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అయితే ఎవరూ గాయపడలేదని స్పష్టంచేశారు. ఈ పేలుడుకుగల కారణాలు తెలియరాలేదన్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదని, ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో నార్వేలోని యూఎస్‌ ఎంబసీ వద్ద పేలుడు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
🏠 Home