సీఈసీ గోబ్యాక్ నినాదాలు, నల్లజెండాలతో నిరసనలు
📅 09 March 2026, 05:37 PM
✍️ M.Chinna
కోల్‌కతా: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు కోల్‌కతా (Kolkata)లో నిరసనల సెగ తగిలింది. ప్రఖ్యాత కాళిఘాట్ ఆలయాన్ని సోమవారం ఉదయం దర్శించేందుకు వచ్చిన ఆయనకు పలువురు నల్లజెండాలతో నిరసనలు తెలిపారు. 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. అయితే పోలీసులు సకాలంలో పరిస్థితిని అదుపు చేశారు. అనంతరం ఆయన ఆలయాన్ని దర్శించుకున్నారు. బెంగాల్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసి తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన అనంతరం తొలిసారి సీఈసీ ఆదివారం రాత్రి కోల్‌కతా వచ్చారు. విమానాశ్రయం వద్ద కూడా ఆయనకు ఇదే తరహా నిరసనలు ఎదురయ్యాయి.