Banner
Watermark
యూఏఈ కాన్సూలేట్‌పై ఇరాక్‌లో డ్రోన్‌ దాడి
📅 10 March 2026, 01:11 PM ✍️ M.Chinna
News Image
పశ్చిమాసియాలో 11వ రోజు భీకరయుద్ధం జరుగుతోంది. 19 వందల మందికి పైగా ఇరాన్‌ సైనికులు చనిపోయినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఆరు విమానాశ్రయాలపై దాడి చేసినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌, అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌ 33వ విడత డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికాకు చెందిన రెండు అత్యాధునిక MQ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన వీడియోను ఇరాన్‌ పంచుకుంది. అటు తుర్కియోలోకి ప్రవేశించిన ఇరాన్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను నాటో కూల్చివేసింది. బహ్రెయిన్‌లో ఇరాన్‌ భారీ డ్రోన్‌ దాడి చేసింది.
🏠 Home