Banner
Watermark
రెండు లిఫ్టులకు రూ.3.55కోట్లా!
📅 10 March 2026, 04:58 PM ✍️ M.Chinna
News Image
చెన్నై: తంజావూరు జిల్లా స్వామిమలైలో స్వామినాథస్వామి ఆలయంలో కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు రూ.3.55కోట్లు అవసరమా? అని తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రశ్నించారు. స్వామినాథ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రెండు లిఫ్టులు ఏర్పాటు చేసేందుకు హిందూ దేవాదాయశాఖ నిర్ణయించింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ పథకానికి భక్తులు కానుకగా చెల్లించిన నిధుల నుండి రూ.3.55 కోట్లు ఖర్చుపెట్టినట్లు దేవాదాయశాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తెలిపారు.ఈ నేపథ్యంలో, అన్నామలై రెండు లిఫ్టుల నిర్మాణానికి రూ.3.55కోట్లు అవసరమా? అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ తన ఎక్స్‌పేజీలో సోమవారం పోస్టు చేశారు. సుమారు 60 అడుగుల ఎత్తులో వున్న ఆలయానికి, తలా 20 మంది ప్రయాణం చేసేందుకు లిఫ్టులు పొందుపరిచేందుకు కేటయించిన నిధుల్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఒక్కొక్క లిఫ్టులో 20 మంది వరకు ప్రయాణించవచ్చని చెప్పిన నేపథ్యంలో, పది మందిని కూడా భరించగల శక్తి ఆ లిఫ్టులకు లేదని, దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నామలై డిమాండ్‌ చేశారు.
🏠 Home