Banner
Watermark
16 మైన్ లేయింగ్ నౌక‌ల‌ను పేల్చేసిన అమెరికా
📅 11 March 2026, 12:56 PM ✍️ M.Chinna
News Image
దుబాయ్‌: ఇరాన్‌తో వార్ నేప‌థ్యంలో హోర్ముజ్ జ‌ల‌సంధి కీల‌కంగా మారింది. వేల సంఖ్య‌లో చ‌మురు నౌక‌లు అక్క‌డే చిక్కుకుపోయాయి. అయితే అమెరికా దాడుల నేప‌థ్యంలో ఆ జ‌ల‌సంధి వెంట వెళ్లే చ‌మురు నౌక‌ల‌ను అడ్డుకునేందుకు ఇరాన్ ప్లాన్ వేసింది. దీని కోసం మైన్ లేయింగ్ నౌక‌ల‌ను అక్క‌డ మోహ‌రించింది. అయితే మంగ‌ళ‌వారం అమెరికా ఆ నౌక‌ల‌పై దాడి చేసింది. హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద ఉన్న సుమారు 16 మైన్‌లేయింగ్ నౌక‌ల‌ను పేల్చిన‌ట్లు అమెరికా సెంట్ర‌ల్ క‌మాండ్ పేర్కొన్న‌ది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సెంట్ర‌ల్ క‌మాండ్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.
🏠 Home