ఇప్పటి డిబేట్‌ను 1954 నాటి చర్చతో పోలుస్తారా?- అప్పట్లో విపక్షాల తరఫున నెహ్రూయే టైం అడిగారు : కాంగ్రెస్
📅 11 March 2026, 01:01 PM
✍️ M.Chinna
మంత్రి కిరణ్ రిజిజుపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు కేటాయించిన 10 గంటల సమయాన్ని, 1954లో ఇలాంటి తీర్మానంపై చర్చకు ఇచ్చిన రెండున్నర గంటల టైమ్‌తో రిజిజు పోల్చడాన్ని హస్తం పార్టీ తప్పుపట్టింది.అప్పట్లో (1954లో) తీర్మానంపై చర్చ కోసం విపక్షాలకు సరిపడా సమయాన్ని కేటాయించాలని స్వయంగా నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కోరారని తెలిపింది. దీంతో పాటు ఆ మొత్తం చర్చలో నెహ్రూ కూర్చున్నారని పేర్కొంది. బుధవారం ఈమేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఒక ట్వీట్ చేశారు.