Banner
Watermark
ప్రజలకు భయపడొద్దని చెబుతున్న మోదీనే భయపడుతున్నారు : రాహుల్
📅 12 March 2026, 12:35 PM ✍️ M.Chinna
News Image
దేశంలో ఎల్​పీజీ సిలిండర్ల కొరత వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజలు భయపడవద్దని చెబుతున్న ప్రధాని స్వయంగా ఆయనే భయపడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఎఫ్​స్టీన్ ఫైల్స్​, అమెరికాలో అదానీ కేసు కారణంగా ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆరోపించారు. గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలు తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.'ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ ఆయనే వేరే కారణాల వల్ల భయాందోళనకు గురువుతున్నారు. ఎఫ్​స్టీన్ పైల్స్, ఆదానీ కేసు కారణంగా ఆయన సభలోకి కూడా రాలేకపోతున్నారు. బుుధవారం కూడా ప్రధాని కుర్చీ ఖాళీగా ఉంది. అంటే ఆయన దేశానికి భయపడకూడదని చెబుతున్నారు. కానీ ఆయనే భయపడ్డారు' అని రాహుల్ గాంధీ అన్నారు.
🏠 Home