Banner
Watermark
ఫరూఖ్‌ అబ్దుల్లాను 20 ఏళ్లుగా చంపాలనుకుంటున్నా’.. దర్యాప్తులో దుండగుడి వెల్లడి
📅 12 March 2026, 04:34 PM ✍️ M.Chinna
News Image
: జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ఆయన ఓ పెళ్లి వేడుకలో పాల్గొని, వేదిక నుంచి తిరిగి వస్తుండగా ఓ దుండుగుడు ఆయనపై పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌ నుంచి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పక్కకు లాగడంతో బుల్లెట్‌ గురితప్పింది. తాను 20 ఏళ్లుగా ఫరూఖ్‌ అబ్దుల్లాను హత్య చేయాలనుకుంటున్నానని పోలీసుల దర్యాప్తులో దుండగుడు వెల్లడించడం గమనార్హం.ఘటనా స్థలంలోనే దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు జమ్ములోని పురాని మండి ప్రాంతానికి చెందిన 63 ఏళ్ల కమల్‌ సింగ్‌ జమ్వాల్‌గా గుర్తించారు. పోలీసుల దర్యాప్తు సందర్భంగా నిందితుడు.. తాను 20 ఏళ్లుగా ఫరూఖ్‌ అబ్దుల్లాను చంపాలని చూస్తున్నానని చెప్పినట్లు వెల్లడించారు.‘నేను ఫరూఖ అబ్దుల్లాను చంపాలని 20 ఏళ్లుగా చూస్తున్నా. ఇప్పుడు నాకు ఆ అవకాశం దొరికంది. కానీ అతడు చావలేదు. అతడు బతికిపోయాడు’ అని పోలీసులు దర్యాప్తులో నిందితుడు చెప్పాడు. ఎందుకు చంపాలనుకుంటున్నావని ప్రశ్నించగా నా వ్యక్తిగత కారణం ఉందని అన్నాడు. పిస్టల్‌ ఎవరిది అని ప్రశ్నించగా తనదే అని పేర్కొన్నాడు.బుధవారం పెళ్లికి హాజరైన ఫరూఖ్‌ అబ్దుల్లా.. జమ్ముకశ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి సురిందర్‌ చౌధరి, ముఖ్యమంత్రి సలహాదారు నజీర్‌ అస్లాం వాని, ఇతర నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకులతో కలిసి వేదిక నుంచి తిరిగి వస్తుండగా కమల్‌ సింగ్‌ హత్యాయత్నం చేశాడు. ఫరూక్‌ అబ్దుల్లా మెడపై పిస్తోల్‌ గురిపెట్టాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అతడిని లాగేయడంతో బుల్లెట్‌ గురితప్పింది.

🏠 Home