Banner
Watermark
మా పిల్లలకు విషం ఇస్తున్నారు
📅 12 March 2026, 04:36 PM ✍️ M.Chinna
News Image
బెంగళూరు: కేసీ వ్యాలి మురుగునీరు మూడోవిడత శుద్ధీకరణ చేయకుండానే కోలారు చెరువులకు విడుదల చేసి విషం నింపుతున్నారంటూ రంగు మారిన నీటి బాటిల్‌తో జేడీఎస్‌ ఎమ్మెల్యే మంజునాథ్‌(JDS MLA Manjunath) నిరసన తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యే వ్యాఖ్యలతో బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముళబాగిలు జేడీఎస్‌ ఎమ్మెల్యే సమృద్ది మంజునాథ్‌ రంగుమారిన నీటి బాటిల్‌ను సభలో ప్రదర్శించారు. బెంగళూరు మురుగనీటిని సంస్కరించి కోలారు, చిక్కబళ్ళాపుర చెరువులకు కోరమంగల-చల్లఘట్ట (కేసీ) వ్యాలీ పథకం గురించి చర్చకు కారణమైంది.ప్రశ్నోత్తర వేళ రెండు చేతులలో తలా ఒక బాటిల్‌ను ప్రదర్శించారు. ఒక చేతిలో బెంగళూరుకు ఇస్తున్న కావేరి నీరు, మరొక చేతిలో కోలారు ప్రజలకు ఇస్తున్న కేసీ వ్యాలీ నీరు అంటూ చిన్ననీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌ఎ్‌స భోసరాజుకు చూపించారు. మీకు చేతులెత్తి విన్నవించుకుంటున్నా, మీరు మాకు భద్ర లేదా కావేరి నీరు ఇవ్వడం లేదు, మురుగునీరు ఇస్తున్నారు, దీన్ని మూడో విడత శుద్ధీకరణ కూడా చేసి ఇవ్వండి, లేకుంటే మా పిల్లలకు విషం ఇచ్చినట్టు అవుతుంది. కోలారు, చిక్కబళ్లాపురల నుంచి కాంగ్రె్‌సకు 8మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మీరు ఆ ప్రజలకు మోసం చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.

🏠 Home