Banner
Watermark
మా దీవులపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ రక్తసిక్తమౌతుంది
📅 12 March 2026, 04:38 PM ✍️ M.Chinna
News Image
పశ్చిమాసియా యుద్ధం 13 రోజుకు చేరింది. అటు ఇజ్రాయెల్, అమెరికా బలగాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్-4లో భాగంగా క్షిపణులతో విరుచుకుపడింది. శక్తివంతమైన ఎమాద్, ఖైబర్, ఖాదర్ బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. ఇటు టెహ్రాన్‌పై మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది. సైనిక కేంద్రాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. IDF వైమానిక దాడుల్లో ఇరాన్‌లో ప్రముఖ బ్యాంకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్​ పార్లమెంట్​ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ సంచలన కామెంట్స్ చేశారు. తమ దీవులపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా దాడులు చేస్తే "పర్షియన్ గల్ఫ్ ప్రాంతం అంతా రక్తంతో నిండిపోతుందని స్పష్టం చేశారు. యుద్ధం వేళ ఖలీబాఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
🏠 Home