Banner
Watermark
కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం
📅 13 March 2026, 03:45 PM ✍️ M.Chinna
News Image
కుత్బుల్లాపూర్ జోనల్ నూతన కమిషనర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేసిన సీనియర్ బిఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ మరియు మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకటశేషాచారి
నూతనంగా నియమితులైన కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ శ్రీ పింకేష్ కుమార్ గారిని జోనల్ కమిషనర్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి ఎస్సార్ నాయక్ నగర్ లో జిహెచ్ఎంసి పార్కు డెవలప్మెంట్ మరియు ఉమ్మడి (130) సుభాష్ నగర్ డివిజన్లో ఉన్న పలు సమస్యలు పరిష్కరించాలని గుబ్బల లక్ష్మీనారాయణ మరియు ఆలూరి వెంకట శేషాచారి జోనల్ కమిషనర్ గారిని కలిసి వినతి పత్రము అందజేయడం జరిగింది ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ గారు మాట్లాడుతూ త్వరలో పర్యటన చేసి కిందిస్థాయి సిబ్బందితో కూడా మాట్లాడి పార్క్ డెవలప్మెంట్ మరియు డివిజన్లో ఉన్న పలు సమస్యలపై పర్యటించి పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి, brs యువ నాయకులు సాయిరాం రెడ్డి, సోమేశ్వరరావు గోవిందస్వామి, కుడుపూడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home