పశ్చిమాసియా ఉద్రిక్తతలు- భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు వీసా పొడిగింపు
📅 14 March 2026, 12:41 PM
✍️ M.Chinna
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో కొన్ని గగనతల మార్గాలు మూసివేయడం, విమానాల రద్దు వంటి పరిణామాల వల్ల అనేక మంది విదేశీయులు భారత్‌లోనే ఇరుక్కుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు వీసా పొడిగింపు ఇవ్వడంతో పాటు ఓవర్‌స్టే జరిమానాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాల కారణంగా ప్రయాణాలకు అంతరాయం ఏర్పడడంతో భారత్‌ను విడిచి వెళ్లలేని విదేశీయులకు ఉపశమనం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.