Banner
Watermark
'భారత నౌకలకు హోర్ముజ్‌ జలసంధి మీదుగా వెళ్లేందుకు అనుమతి'- ఇరాన్ రాయబారి
📅 14 March 2026, 12:42 PM ✍️ M.Chinna
News Image
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న వేళ హోర్ముజ్‌ జలసంధి ద్వారా భారత్‌కు వేళ్లే నౌకలకు సురక్షిత మార్గం కల్పించనున్నట్లు భారత్‌లోని ఇరాన్‌ రాయబారి మహమ్మద్‌ ఫతాలి స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హోర్ముజ్‌లో భారత్‌ నౌకలకు సురక్షిత ట్రాన్సిట్‌ అనుమతిస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఫతాలి భారత్‌ తమకు మంచి స్నేహితుడిని వారికి సురక్షిత మార్గం కల్పిస్తామని ధ్రువీకరించారు.

'భారత్-ఇరాన్ మధ్య స్నేహం ప్రత్యేకం'
భారత్​, ఇరాన్ మంచి స్నేహబంధం ఉందని, రెండు దేశాలకు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయని ఫతాలి తెలిపారు. భారత్ ప్రజల బాధ తమ బాధగా భావిస్తామని, అదే విధంగా ఇరానీయుల పరిస్థితిని భారత్ కూడా అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు. రెండు దేశాలకు సాధారణ ప్రయోజనాలు, ఒకే విధమైన భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందన్నారు. ఈ కారణంగానే భారత్‌ తమకు సాయం చేస్తుందన్నారు

🏠 Home