ఆ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు- నేడే షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ
📅 15 March 2026, 12:05 PM
✍️ M.Chinna
దేశంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలుకానుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించనుంది. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బంగాల్ , కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ గడువు మే, జూన్లో ముగియనుంది.