ఎల్‌పీజీ కొరత ఎఫెక్ట్: ప్రజల చూపు ఇండక్షన్ స్టవ్ వైపు- ఎక్కడ కొనాలి
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం భారతదేశంలోని సామాన్యుడి వంటగదిలో సెగలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర సగటున రూ.60 దాకా పెరిగింది. వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే ఆందోళనలో జనం ఉన్నారు. వంటగ్యాస్ రాకుంటే, గ్రామీణ ప్రాంతాల ప్రజలు కట్టెల పొయ్యిపై వంటలు వండుకుంటారు. కానీ నగరాలు, పట్టణాల్లోని ప్రజలకు ఆ ఛాన్స్ ఉండదు. అందుకే ఇప్పుడు వాళ్లందరి చూపు ఇండక్షన్ కుక్‌టాప్ వైపు ఉంది.
నగరాలకు చెందిన చాలామంది ప్రజానీకం ముందుజాగ్రత్త చర్యగా ఇండక్షన్ కుక్‌టాప్‌లను కొనేస్తున్నారు. వీటికోసం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఆర్డర్లు పెడుతున్నారు. దీంతో దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లలోని ఎంతోమంది రిటైలర్ల దగ్గర ఇండక్షన్ కుక్‌టాప్‌ల స్టాక్ అయిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇండక్షన్ కుక్‌టాప్ ఎలా పనిచేస్తుంది ? దాన్ని కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలేంటి ? ఇండక్షన్ కుక్‌టాప్ నిర్వహణకు పాటించాల్సిన టిప్స్ ఏమిటి ? ఈ కథనంలో తెలుసుకుందాం.