జ్యోతిష్యం పేరుతో అకృత్యాలు.. బాధితుల్లో 58 మంది మహిళలు
📅 20 March 2026, 11:58 AM
✍️ M.Chinna
ముంబై: వ్యక్తిగత సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఆడవాళ్లను మోసం చేస్తున్న రిటైర్డ్ మర్చెంట్ నేవీ ఆఫీసర్‌ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అశోక్ ఖారత్)గా గుర్తించారు. అతనో జ్యోతిష్యుడు కూడా. ఓ 35 ఏళ్ల మహిళను లైంగికంగా వేధించిన కేసులో అతను పోలీసులకు చిక్కాడు. ఆధ్యాత్మికత పేరుతో అతను తన అకృత్యాలను కొనసాగించాడు. వివరాల్లోకి వెళ్తే.. అశోక్ ఖారత్ వయసు 67 ఏళ్లు. పూజలు చేస్తానని చెప్పి 35 ఏళ్ల మహిళను వశపరుచుకున్నాడు. ఆమెకు మత్తు మందును ఇచ్చి.. హిప్నటైజ్ చేశాడు. ఆ తర్వాత శారీరకంగా ఆమెపై దాడి చేశాడు. మూడేళ్లుగా వేదన అనుభవించిన ఆ మహిళ చివరకు పోలీసుల్ని ఆశ్రయించింది. కేసును చేధించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. కేవలం ఒక్క మహిళే కాదు.. ఆ ఆస్ట్రాలజర్ ఉచ్చులో అనేక మంది మహిళలు బలైనట్లు గుర్తించారు.పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఖారత్‌ను రిటైర్డ్ మెర్చంట్ నేవీ ఆఫీసర్‌గా గుర్తించారు. అతన్ని కెప్టెన్‌గా కూడా పిలుస్తారు. పర్సనల్ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి ఆడవాళ్లను తన ఆఫీసుకు రావాలని పిలిచేవాడు. అక్కడకు వెళ్లిన మహిళలను హిప్నటైజ్ చేసేవాడు. మత్తు ఇచ్చి ఆ పని చేసేవాడని పోలీసులు చెప్పారు. ఆ మహిళలను భయపెట్టి వారిని రేప్ చేసేవాడని తెలిసింది. భర్తలను చంపేస్తానని లేదంటే.. చేతబడి పూజలతో వణుకు పుట్టించేవాడు. ఫార్మౌజ్ వేదికగా ఈ అకృత్యాలకు పాల్పడ్డాడు. అయితే అతని ఆఫీసులో సీసీకెమెరాలను ఇన్‌స్టాల్ చేశాడు. ఆఫీసు నుంచి ఓ పెన్‌డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో చాలా మంది మహిళలతో శృంగారం చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. సుమారు 58 మంది మహిళలతో అసభ్యకరంగా ఉన్న వీడియో క్లిప్‌లను గుర్తించారు.