Banner
Watermark
ఇరాన్​కు కశ్మీరీలు భారీ సాయం- నగదు, బంగారం, నిత్యావసరాలు విరాళం- కృతజ్ఞతలు తెలిపిన ఎంబసీ
📅 23 March 2026, 12:09 PM ✍️ M.Chinna
News Image
అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్​పై దాడి చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీకార దాడులతో యుద్దం మరింత తీవ్రమవుతోంది. ఈ దాడుల వల్ల ఇరాన్​లోని చాలా ప్రాంతాలు దెబ్బతిన్నాయి. పాఠశాలలు, భవనాలు, ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ క్రమంలో ఇరాన్​కు జమ్ముకశ్మీర్​లోని ప్రజలు భారీ సాయం అందించేందుకు ముందుకొచ్చారు. నగదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు వంటి పంపించారు. ఇందుకు భారత్​లోని ఇరాన్ రాయాబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.యుద్ధంతో ప్రభావితమైన ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా షియాలు అధికంగా ఉన్న బుద్గామ్, బారాముల్లా జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రంజాన్ మరుసటి రోజు ఆదివారం భారీ విరాళాలు వచ్చాయి. ప్రజలు నగదు మాత్రమే కాకుండా బంగారు ఆభరణాలు, పశువులు, సంప్రదాయ రాగి పాత్రలు వంటి విలువైన వస్తువులను కూడా విరాళంగా అందించారు.ఇంటింటికీ వెళ్లి సేకరణ
ఇరానీయులకు సాయం చేసేందుకు ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు, మహిళలు, పురుషులు అందురు పాల్గొన్నారు. మహిళలు తమ బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. అలాగే ఇళ్లలోని విలువైన వస్తువులను, కొందరు తమ పశువులను కూడా సాయంగా ఇచ్చారు. పిల్లలు సైతం తమ పొదుపు నగదును, ఈద్ సందర్భంగా పొందిన డబ్బును ఇచ్చారు.
🏠 Home