న్యూయర్క్ ఎయిర్‌పోర్టులో ఢీకొన్న ట్రక్కు, విమానం..
📅 23 March 2026, 12:16 PM
✍️ M.Chinna
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న లా గార్డియా విమానాశ్రయంలో .. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన విమానాన్ని ట్రక్కు ఢీకొన్నది. ఫ్లయిట్ రేడార్24 వెబ్‌సైట్ ప్రకారం ఆ విమానాశ్రయంలో ప్రస్తుతం రాకపోకలు స్తంభించాయి. ఎయిర్‌పోర్టులోని నాలుగవ రన్‌వేపై ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్, రన్‌వే దగ్గర ఉన్న ఫైర్ ఇంజిన్ ఢీకొన్నట్లు సమాచారం ఉన్నది. ఈ ఘటనకు చెందిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. విమానం ముక్కు భాగం చాలా ఎత్తుకు లేచినట్లు కొన్ని వీడియోల ద్వారా తెలిసింది. కెనడా విమానంలోని ప్రయాణికులను దించేశారు. అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు అమెరికా విమానయాన సంస్థ పేర్కొన్నది. అయితే ఎంత మంది గాయపడ్డారు, ఏ స్థాయిలో నష్టం జరిగిందన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం ఇద్దరు ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తోంది.