తమిళనాడులో ఎన్డీఏసీట్ల సర్దుబాటు- బీజేపీకి 27 సీట్లు
📅 23 March 2026, 04:59 PM
✍️ M.Chinna
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. బీజేపీ 17స్థానాల్లో, పీఎంకే 18, ఏఎంఎంకేకు 11నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నాయి. మిగితా 188స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయనుంది. ఈ మేరకు చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్డీయే పక్షాల భేటీలో నిర్ణయం జరిగింది. ఈ సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి, కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాసు, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ పాల్గొన్నారు. 234స్థానాలు కలిగిన తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.