Banner
Watermark
రాహుల్​ గాంధీకి ప్రాంతీయ నాయకుడికి ఉన్నంత అవగాహన కూడా లేదు: కేరళ సీఎం
📅 26 March 2026, 04:58 PM ✍️ M.Chinna
News Image
కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్​ గాంధీ జాతీయ నాయకుడు అయినప్పటికీ, లోకల్ లీడర్​కు ఉన్నంత అవగాహన కూడాలేదని విమర్శలు గుప్పించారు. గత అనుభవాల నుంచి నేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. అంతేకాదు, రాహుల్​ ఆయన పార్టీ బీజేపీకి బీ టీమ్​గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోతమంగళంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"వాస్తవం ఏమిటంటే, రాహుల్​ గాంధీ ఓ జాతీయ నాయకుడు. అయినప్పటికీ ప్రాంతీయ నాయకుడికి ఉన్నంత అవగాహన కూడా ఆయనకు లేదు. అంతేకాదు, ఆయన ఏ విషయాన్ని ఆయన లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి లక్షణాలు రాజకీయ నాయకుడికి తగవు. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిలో ఇలాంటి దిగజారుడు కనిపించడం ఆశ్చర్యకరం"
🏠 Home