Banner
Watermark
యుద్ధంతో పరిస్థితులు మారుతున్నయ్‌.. సీఎంల భేటీలో ప్రధాని మోదీ
📅 28 March 2026, 01:00 PM ✍️ M.Chinna
News Image
న్యూఢిల్లీ : పశ్చిమాసియా ఘర్షణల కారణంగా తలెత్తిన ప్రపంచ పరిస్థితి నిరంతరం మారుతూనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కాపాడుకోవడం, ఇంధన భద్రతను నిర్ధారించడం, పరిశ్రమలను, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, పౌరుల ప్రయోజనాలను పరిరక్షించడం వంటివి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయని ఆయన ప్రకటించారు. శుక్రవారం ముఖ్యమంత్రులతో జరిగిన వర్చువల్‌ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని ఈ పరిస్థితికి నిరంతర పర్యవేక్షణ, అనుకూల వ్యూహాలు అవసరమని అన్నారు.
🏠 Home