Banner
Watermark
సిబిఎస్ఈ పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని
📅 16 April 2026, 12:08 PM ✍️ M.Chinna
News Image
చౌటుప్పల్, ఏప్రిల్ 16,(వార్త పత్రిక);చౌటుప్పల్‌లోని అన్నా మెమోరియల్ పాఠశాలలో 2025-26 మార్చిలో నిర్వహించిన సిబీఎస్ఈ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలతో పాఠశాల గర్వకారణంగానిలిచింది.
ఈ ఫలితాల్లో ముఖ్యంగా పాఠశాల టాపర్ విద్యార్థిని డి. సాన్వి 500 లో 473 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది.అలాగే పలువురు విద్యార్థులు ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించి మంచి ఫలితాలు నమోదు చేశారు.ఈ సందర్భంగా పాఠశాల మేనేజర్ ఫాదర్ చిన్నప్ప రెడ్డి, ప్రిన్సిపాల్, యాజమాన్యం మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల మార్గదర్శకమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.
విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పాఠశాల కట్టుబడి ఉందని ఈ ఫలితాలు మరోసారి నిరూపించాయి
🏠 Home