జయాత్రేయ ఎన్‌క్లేవ్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక
వార్తాపత్రిక, కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 16: మల్లంపేట్ పరిధిలోని జయాత్రేయ ఎన్‌క్లేవ్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షురాలిగా బి. సబితా రెడ్డి, కార్యదర్శిగా కె. మనోజ్ కుమార్ ఎన్నికయ్యారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ జయాత్రేయ ఎన్‌క్లేవ్‌లో జరిగిన సభ్యుల సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు బుధవారం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా నూతన కమిటీ పని చేయాలని పేర్కొన్నారు.
ఉపాధ్యక్షులుగా కె. కిషోర్
జాయింట్ సెక్రటరీగా షేక్ జలీల్ అహమ్మద్ కోశాధికారిగా ఎన్. దుర్గా ప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా
పొట్లపల్లి హేమాద్రి రావు, రాథోడ్ నితీష్, దేవిరెడ్డి మేరీ పల్లవి, నడిమింటి శశాంక్ లు ఎన్నికయ్యారు.
కాలనీ వాసులందరి సహకారంతో జయాత్రేయ ఎన్‌క్లేవ్‌ను ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. రిజిస్టర్ నంబర్ 350/2026 తో ఈ నూతన కమిటీ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని తెలిపారు.