Banner
Watermark
అక్రమంగా మట్టి తరలిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలి
📅 17 April 2026, 05:51 PM ✍️ M.Chinna
News Image
చౌటుప్పల్, ఏప్రిల్ 17 (వార్త పత్రిక)
పై విషయనుసారం తమరితో విన్నపించేదేమనగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామంలో అనుమతి లేకుండా అక్రమంగా విచ్చలవిడిగా రాత్రి పగలు అనే తేడా లేకుండా చౌటుప్పల్ హైవే మీదుగా నల్లమట్టని తరలిస్తున్నారు. తరలిస్తున్న వారిని ఇదేమిటని నిలదీయగా నాకు అనుమతులు ఉన్నాయి అని అంటున్నారు. నాకు అవగాహన ఉన్నంతవరకు ఒకవేళ అనుమతులు ఇచ్చిన రాత్రి సమయంలో ఎలా అనుమతి ఇస్తారు. ఈ టిప్పర్ల వలన చౌటుప్పల్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.ఈ విషయాన్ని చౌటుప్పల్ లోని సంబంధిత ఎమ్మార్వో,సీఐ కి తెలియజేసి విషయం వారి దృష్టికి తీసుకెళ్లిన కూడా పట్టించుకోవడం లేదు కావున అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న టిప్పర్ల పై అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి
🏠 Home