Banner
Watermark
బూర్గుల ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ కాలేయ దినోత్సవంరంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే లలితాదేవి
📅 18 April 2026, 07:14 PM ✍️ M.Chinna
News Image
వార్త పత్రిక షాద్ నగర్ ఏప్రిల్18:ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యమరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే లలితా దేవి మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో ఒకటి కాలేయం (లివర్ )అని ఇది శరీరంలో అనేక ముఖ్యమైన జీవక్రియలకు కేంద్ర బిందువుగా పనిచేస్తుంది మనం తీసుకునే ఆహారము నీరు ఔషధాలు వంటి అన్ని పదార్థాలను శుద్ధి చేయడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇది 500 పైగా ముఖ్యమైన విధులను నిర్వహిస్తుందని,తెలిపారు కాలేయానికి ప్రత్యేకంగా పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ నిర్లక్ష్యం వలన తీవ్రమైన నష్టం కలగవచ్చు, ముఖ్యంగా కాలేయం దెబ్బతిన్న ప్రారంభ దశలో లక్షణాలు కనిపించకపోవడం వల్ల దీనిని నిశ్శబ్దహంతకుడు అని పిలుస్తారు.ప్రస్తుతం కాలేయ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయిమద్య సేవనం మాత్రమే కాకుండా అధిక కొవ్వు వున్న ఆహారము ,జంక్ ఫుడ్ ,వ్యాయామం లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి కారణంగా “నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ “ కేసులు కూడా ఘననీయంగా పెరుగుతున్నాయి అని ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ కే లలిత అదేవి తెలిపారు.ప్రతిరోజు కనీసం 30 నుండి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి ,సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి ,జంక్ ఫుడ్ అధిక కొవ్వు పదార్థాలు ,చక్కెర పానీయాలు,తగ్గించాలి .మద్యపానం పూర్తిగా నివారించాలి ,తగినంత నీరు తాగాలి ,ఏడాదికి ఒకసారి కాలేయ పనితీరు పరీక్షలు చేయించుకోవాలి .హెపటైటిస్ బి వంటి వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి.“మంచి అలవాట్లు -పటిష్టమైన కాలేయం”అని నినాదంతో ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని డాక్టర్ కే లలితా దేవి పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంలో పౌరుల ఆరోగ్యమే కీలకమని, కాలేము మన శరీరంలోని నిశ్శబ్ద ఇంజన్ వంటిదని, అది ఎంత స్మూత్ గా రన్ అయితే, మన జీవితం అంతా కాలం సాఫీగా సాగుతుందని, ప్రపంచ కాలేయ దినోత్సవ సందర్భంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా శారీరక తమ చేస్తూ మన కాలేయాన్ని కాపాడుకుందాం అని ప్రతిజ్ఞ చేద్దాం. కాలేయ రక్షణ జీవన రక్ష అని గుర్తిద్దామని రంగారెడ్డి జిల్లా డాక్టర్ కే లలితా దేవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ కె శ్రీనివాసులు, బూర్గుల వైద్యాధికారి డాక్టర్ రఘురాం, డాక్టర్ జయప్రకాష్, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటరమణి స్టాఫ్ నర్స్ సునీత ఫార్మసిస్ట్ రాజశ్రీ, హెల్త్ అసిస్టెంట్ రెడ్డి నాయక్ ఏసి సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home