అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఇసుక మాఫియా వైపు కన్నెత్తి చూడని అధికారులు
వార్త పత్రిక ఏప్రిల్ 21-4-2026
ప్రభుత్వంమారినాఇసుకఅక్రమాలుఆగడంలేదు
రాత్రిపగలుతేడాలేకుండాఇసుకనుతోడేస్తున్నరు
బోరు బావుల నుండి నీరు సక్రమంగా వస్తలేదు
సంబంధిత అధికారులు తనిఖీలునిర్వహిస్తున్న ఇసుక దందా ఎలా కొనసాగుతుంది..? కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక దందాకు పూర్తిమద్దతు అని ఆరోపణలుఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకూపెరిగిపోతున్నాయి.ఎలాంటిఅనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. మిడ్జిల్ మండలం లో ప్రభుత్వం మారినా ఇసుక అక్రమాలు ఆగడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలను మండల లోని గ్రామల సరిహద్దు వద్ద నిర్మానుష ప్రాంతాలలో ఇసుక డబ్బులు చేస్తున్నారు. మిడ్జిల్ మండలంలో కొన్ని రోజుల క్రితం టాక్టర్లలో ఇసుక లోడింగ్ చేస్తుండగా రైతులు, గ్రామస్తులు అడ్డు వస్తున్నారని వారిపై దాడులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.
రైతన్నల ఆవేదన ఇష్టం వచ్చినట్లు దుందుభి వాగు ప్రాంతాలలో అడ్డగోలుగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. ప్రస్తుతం ఎండాలు బాగా ముదురుతున్నాయి భూగర్భ జలాలు అడుగంటి పోయే అవకాశాలు ఉన్నాయి. ఉన్న బోరు బావుల నుండి నీరు సక్రమంగా వస్తలేదు, బోరు బావుల నుండి నీరు రాక పంటలు చేతికి రాకముందే ఎండిపోయేటట్లు ఉంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్చర్ల నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న మండలా లలో కొంత మంది సంబంధిత అధికారులు ఇసుక మాఫియాతో నెలవారి మామూళ్లకు అలవాటు పడి మా రైతుల పొట్టన కొడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా మామూళ్లకు అలవాటు పడకుండా అక్రమ ఇసుక రవాణా చేసే మాఫియా పైన అధికారులు చర్యలు తీసుకుంటే ఇసుక మాఫియాకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని రైతులు కోరుతున్నారు.
రాత్రి వేళ టిప్పర్లు, టాక్టర్లలో అక్రమ రవాణా
ఈ ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల, అధికారపార్టీ నాయకుల అండదండలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను, వారి ఆగడాలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు.నిత్యంఅన్ని రహదారులపై పోలీసులుగస్తీతిరుగుతుండటం, మరో వైపున రెవెన్యూ, మైనింగ్ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ అక్రమ ఇసుక దందాఎలాకొనసాగుతుందనేప్రశ్నలుఉత్పన్నమవుతున్నాయి.ఈ ఇసుక డంపుల నుంచి దూర ప్రాంతాలకు రాత్రి వేళ టిప్పర్లలో దగ్గరి ప్రాంతాలకుడాక్టర్లతోతరలిస్తున్నారనేఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధులు ఇసుక దందాకు పూర్తి మద్దతు ఇస్తుండటంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చట్టాలను, ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు కొందరు అక్రమార్కులతో చేతులు కలపడంతో ఇసుకమాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.