Banner
Watermark
మేడారంలో బస్టాండ్ నిర్మించాలి
📅 22 April 2026, 03:01 PM ✍️ M.Chinna
News Image
వార్త పత్రిక ములుగు జిల్లా

కాళేశ్వరంలో బస్టాండ్ ఓకే మరి మేడారం సంగతి ఏంటి?
టీడీపీ ములుగు నియోజకవర్గం ఇంచార్జ్ దారావత్ దేవా నాయక్
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మేడారంలో 10 కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మించాలని టీడీపీ ములుగు నియోజకవర్గం ఇంచార్జ్ దారావత్ దేవా నాయక్ డిమాండ్ చేశారు మేడారం ప్రాంతం కు ఎక్కువ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించింది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అని ములుగు టైగర్ మాజీ ఎమ్మెల్యే చర్ప భోజరావు కృషితోనే ఇదంతా జరిగింది అని ఆతర్వాత గెలిచినా వాళ్ళు ఫోటోలు దిగడం తప్ప చేసింది శూన్యం అని గత జాతరకు 250 కోట్లు మంజూరు చేసి కమిషన్ లు తిన్నారు కాని కనీసం ఒక బస్టాండ్ కట్టాలి అని సోయి లేదని వచ్చే సంవత్సరంలో జరిగేజాతరఅభివృద్ధికినిధులుకేటాయించాలని ప్రభుత్వం మేడారంలో మరియుఊరట్టంస్థూపం దగ్గర కొత్తూరుఊరట్టంకాలనీవెంగ్లాపూర్, నార్లపూర్లలో బస్టాండ్ నిర్మించాలని మర్చిపోయారు అని విమర్శించారు కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇస్తూ రైల్వే సౌకర్యం మంజూరు చేసిన స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఎందుకు అంటే ఈ ప్రభుత్వంకు మేడారం అంటే వివక్ష ఉంది కాబట్టి అని అందుకే మేడారం ప్రాంత అభివృద్ధి ని పట్టించుకోవడం లేదని,ఇటీవలే కాళేశ్వరం వెళ్లిన సీఎం కాళేశ్వరం బస్టాండ్ కు 3 కోట్ల 71 లక్షల రూపాయలు మంజూరు చేశారు కానీ ప్రపంచంలో పేరు పొందిన మేడారం కు బస్టాండ్ ఎందుకు మంజూరు చేయలేదో చెప్పాలి అని డిమాండ్ చేశారు త్వరలో కలెక్టర్, ప్రిన్సిపాల్ సెక్రటరీని కలిసి బస్టాండ్ కావాలి వివరిస్తాం అని తెలిపారు
🏠 Home