Banner
Watermark
ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతుంది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
📅 06 May 2026, 04:56 PM ✍️ M.Chinna
News Image
వార్తాపత్రిక మే 6 చండూర్
ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్నిస్తుంది...చండూరు మున్సిపాలిటీలోని లకినేనిగూడెం 3వ వార్డుకు చెందిన పాశం యాదిరెడ్డి గారి నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమము చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదల సొంత ఇంటికాలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పేదలకు ఒక వరం లాంటిదని తెలిపారు ఈ సందర్భంగా పాశం యాదగిరి రెడ్డి దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఇట్టి గృహ ప్రవేశ కార్యక్రమముకు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, కోడి సుష్మవెంకన్న, కటకం రమేష్ కో-ఆప్షన్ సభ్యులు గౌరవ కల్లెట్ల చంద్రకళమారయ్య, షేక్ ఖలీల్, మొగుదాల సత్తమ్మవెంకన్న, షేక్ సలీమా షరీఫ్ గార్లు, వార్డ్ ఆఫీసర్స్ జి. శ్రీరాములు, బి. సాయిరాం మరియు బిల్ కలెక్టర్ జి. రమేష్ పాల్గొనడం జరిగింది.
🏠 Home