వాణిజ్య గ్యాస్ సిలిండర్, నిత్యావసరం సరుకులు, కూరగాయల ధరలు తగ్గించాలి. సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్.
వార్తాపత్రిక మే:7
పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని, సిపిఐ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిజాంపేట్ మెయిన్ రోడ్డులో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. అనంతరం సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రజా, రైతు, కార్మిక వెతిరేక విదనాలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నీరసనలో భాగంగా నిజాంపేట్లో మెయిన్ రోడ్డులో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించము అని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పటు అయినా తరువాత అనేక సార్లు గ్యాస్ ధరలు పెంచడం జరిగింది అని అన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ కొరత లేకపోయినా కొరత ఉన్నట్లు, దానికి అమెరికా, ఇరాన్ యుద్ధమే కారణము అని చేపి తాత్కాలిక కొరతను సృష్టించి తద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే యోచనలో మోడీ ప్రభుత్వం వుంది అని వారు వివరించారు. దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు పెరిగిన కేంద్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేయడం లేదు అని అన్నారు. కానీ రోజు వారి కూలీకీ మాత్రం జీతం పెరగడం లేదు అని గుర్తు చేశారు. కనుక దేశ వ్యాప్తంగా రైతులను, కార్మికులను, విద్యార్థులను సమీకరించి పెరిగిన ధరలు తగ్గించే వరకు పెద్ద ఎత్తున్న పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆశి. యాదయ్య, పొన్నకంటి దస్తగిరి, నర్సింహా, కృష్ణ, దుర్గయ్య, మల్లేష్, శంకర్, నర్సమ్మ, భాగ్యమ్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.