చౌటుప్పల్, మే 06,(వార్త పత్రిక);యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సింగిల్ విండో (పీఏసీఎస్) చైర్మన్ గా చింతల దామోదర్ రెడ్డి హైకోర్టు కోర్టు తీర్పు మేరకు బుధవారం మరోసారి బాధ్యతలు చేపట్టారు. సింగిల్ విండో కార్యదర్శి వై రమేష్ చైర్మన్ గా దామోదర్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.2020లో ఎన్నికైన సింగిల్ విండో పాలకవర్గంనే ఎన్నికలు జరిగే వరకు కొనసాగించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అధికారులను ఆదేశించడంతో ప్రభుత్వం పాత వర్గాలనే కొనసాగిస్తూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో తిరిగి పాత పాలకవర్గమే బాధ్యతలు చేపట్టింది చైర్మన్ గా దామోదర్ రెడ్డి, సభ్యులుగా చెన్నగోని అంజయ్య గౌడ్, బోరెం నర్సిరెడ్డి, గుండెబోయిన రూపమ్మ మల్లయ్య, దుర్గ కృష్ణ, పబ్బతి వెంకటయ్య, దొడ్డి శ్రీశైలం, బొడ్డు పద్మ, సప్పిడి వెంకట్ రెడ్డి, బాతరాజు సాయిలు, పానుబోతు సూర, దౌడీ బాలరాజు, దుబ్బాక శశిధర్ రెడ్డి లు బాధ్యతలు చేపట్టారు