జవహర్ బాల్ మంచ్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా పెద్దగోని రమేష్ గౌడ్ నియామకం
చౌటుప్పల్, మే 07,(వార్త పత్రిక);జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా నియామకం జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర చైర్మన్ మామిడి రిషికేష్ రెడ్డి సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ గా రాష్ట్ర కో ఆర్డినేటర్ పెద్దగోని రమేష్ గౌడ్ ని ఈరోజు నియామకం చేయడం జరిగింది. పెద్దగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ టిపిసిసి జవహర్ బాల్ మంచ్ బాలల సాధికారతకు సంబంధించి కార్యక్రమాలు చేపట్టాలని, బాలల్లో నాయకత్వ లక్షణాలు, శాస్త్రీయ దృక్పథం పెంపొందించడంతో పాటు, ప్రాథమిక విధులు, గాంధీ, నెహ్రూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జవహర్ బాల్ మంచ్ ఉద్దేశమని సంగారెడ్డి జిల్లా లో జవహర్ బాల్ మంచ్ గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతామని రమేష్ గౌడ్ తెలియజేసారు.కాంగ్రెస్ పార్టీ మరియు జవహర్ బాల్ మంచ్ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ నియామకాన్ని ప్రకటించిన రిషికేష్ రెడ్డికి రమేష్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేసారు. నేను ఈ స్థాయికి రావడానికి వెన్ను తట్టి ప్రోత్సహించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రమేష్ గౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు