భారత ప్రభుత్వం జన గణన 2027లో ప్రారంభమయ్యే మొదటి దశ ఇండ్ల జాబితాఇండ్ల గణన యొక్క స్వీయ నమోదు ప్రక్రియలో జిల్లా ప్రజలు, అధికారులు బాధ్యతగా పాల్గొనాలనిజిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) కిరణ్మయి
వార్త పత్రిక షాద్ నగర్ మే07: గురువారం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కిరణ్మయి గారు తన ఛాంబర్ లో ఇండ్ల గణన యొక్క స్వీయ గణన ద్వారా తమ వివరాలను పోర్టల్ లో నమోదు చేశారు.జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యావంతులు, ప్రజలు అందరూ ఇండ్ల గణన స్వీయ నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఇండ్ల గణన స్వీయ నమోదు కోసం మే 10వ తేదీ వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నారు. https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఎవరికి వారు ఇండ్ల గణన స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భారత ప్రభుత్వం జన గణన – 2027 ప్రక్రియను రెండు దశలలో చేపడుతోందని తెలిపారు. మొదటి దశలో మే 11 నుండి జూన్ 9వ తేదీ వరకు ఇండ్ల గణన చేస్తారని కలెక్టర్ వివరించారు. రెండవ దశలో 2027 ఫిబ్రవరి 9వ తేదీ నుండి 28 వ తేదీ వరకు జనాభా గణన,కులగణన ఉంటుందన్నారు.
ఇందులో భాగంగానే ఏప్రిల్ 26 నుండి ఇండ్ల గణన యొక్క స్వీయ గణన (SELF- Enumeration) ప్రారంభం అయినదని అన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ గణనలో పాల్గొనాలని ఆమె కోరారు. ఇండ్ల గణన కోసం 11.05.2026 నుండి 09.06.2026 వరకు మీ ఇంటి వద్దకు వచ్చే నమోదు అధికారికి అన్ని వివరాలు తెలియజేయాలని సూచించారు. జన గణన వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా స్వీయ నమోదు చేసుకుని, ఇండ్ల గణనకు వచ్చే అధికారికి సరైన సమాచారాన్ని ఇచ్చి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కోరారు.
స్వయంగా వివరాలను నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ పోర్టల్ అనేది రాష్ట్రంలో ఇండ్ల గణన ప్రారంభం కావడానికి సరిగ్గా 15 రోజులు ముందు నుంచి ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వీయ గణనలో భాగంగా పౌరులు సెన్సస్ పోర్టల్ లో ఉన్న 33 ప్రశ్నలకు వివరాలను స్వయంగానమోదు చేసుకోవచ్చని తెలిపారు. స్వీయ గణన గురించి యువత, విద్యార్థులు అందరికీ అవగాహన కలిగించాలని అన్నారు. ఈ డేటా ఆధారంగానే ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. మొదటిసారిగా ఈ ప్రక్రియ డిజిటల్ రూపంలో జరుగుతోందని అన్నారు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఎప్పుడైనా వివరాలను నమోదు చేయవచ్చని తెలిపారు. స్వయంగా నమోదు చేయడం వల్ల తప్పులు జరగడానికి ఆస్కారం ఉండదని,సమయం ఆదా అవుతుందని చెప్పారు. నమోదు అనంతరం ఐ.డి. జనరేట్ అవుతుందని, దానిని స్క్రీన్‌షాట్ తీసుకుని భద్రపరచుకోవాలని సూచించారు. ఎన్యూమరేటర్
వచ్చినప్పుడు ఆ ఐ.డి.ని చూపిస్తే జనాభా గణన ప్రక్రియ సులభంగా వేగవంతమవుతుందని చెప్పారు.సెల్ఫ్ ఎన్యూమరేషన్: ఆన్‌లైన్‌లో నమోదు విధానం (దశల వారీ ప్రక్రియ)మీ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంట్లోనే ఉండి మీ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి:దశ 1 (వెబ్‌సైట్): ముందుగా భారత ప్రభుత్వ అధికారిక సెన్సస్ పోర్టల్ se.census.gov.inను ఓపెన్ చేయండి.దశ 2 (భాష ఎంపిక): వెబ్‌సైట్‌లో కుడివైపు పైన మీ ప్రాంతీయ భాష (తెలుగు లేదా ఇంగ్లీష్) ఎంచుకోండి.దశ 3 (లాగిన్): మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, దానికి వచ్చే ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.దశ 4 (చిరునామా): మీ రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ మరియు మీ గ్రామ/వార్డు వివరాలను ఎంచుకుని, డిజిటల్ మ్యాప్‌పై (జియో-మ్యాపింగ్) మీ ఇంటిని కచ్చితంగా గుర్తించండి.దశ 5 (ప్రశ్నావళి): స్క్రీన్ పై కనిపించే సెన్సస్ సంబంధిత ప్రశ్నలకు (హౌస్ లిస్టింగ్ & డెమోగ్రాఫిక్స్) మీ కుటుంబ సభ్యుల ఆధారంగా సరైన సమాధానాలు ఇవ్వండి.దశ 6 (సబ్‌మిషన్ వివరాలన్నీ ఒకసారి సరిచూసుకుని 'సమర్పించు' నొక్కండి. వెంటనే మీ మొబైల్‌కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ నంబర్ వస్తుంది. ఆ నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరుచుకోండి.జనగణనలో అడిగే ముఖ్యమైన ప్రశ్నలు మీరు ఆన్‌లైన్‌లో ఫారమ్ నింపేటప్పుడు ఇళ్లు మరియు కుటుంబానికి సంబంధించి మొత్తం 31 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో ముఖ్యమైనవి కింది పట్టికలో చూడవచ్చు: (వర్గం) అడిగే ప్రధాన ప్రశ్నలు (ముఖ్య ప్రశ్నలు)ఇంటి వివరాలు (హౌసింగ్) ఇంటి నంబర్, గోడలు/పైకప్పు మెటీరియల్, సొంతమా/అద్దెక, గదుల సంఖ్య.కుటుంబ వివరాలు (డెమోగ్రాఫిక్స్) మొత్తం సభ్యులు, యజమాని పేరు/లింగం, ఎస్సీ/ఎస్టీ/ఇతర కేటగిరి.మౌలిక సదుపాయాలు (సౌకర్యాలు) త్రాగునీటి వనరు, మరుగుదొడ్డి, వంట, విద్యుత్.ఆస్తులు/గ్యాడ్జెట్స్ (ఆస్తులు) ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, టెలివిజన్, ద్విచక్ర/నాలుగు చక్రాల వాహనాలు.ముగింపుమీరు ఆన్‌లైన్‌లో (స్వీయ గణన) వివరాలను విజయవంతంగా నమోదు చేసినప్పటికీ, ప్రభుత్వ ఎన్యూమరేటర్ (గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది లేదా టీచర్) భౌతికంగా మీ ఇంటికి వస్తారు. అప్పుడు మీరు ఆన్‌లైన్ ద్వారా పొందిన 'సీఈ ఐ డి' నంబర్‌ను వారికి చూపిస్తే సరిపోతుంది . వారు తమ డివైజ్‌లో మీ వివరాలను క్రాస్-వెరిఫై చేసి ఫైన కన్ఫర్మేషన్ ఇస్తారని తెలిపారు.జిల్లా పౌర సంబంధాల అధికారి రంగారెడ్డి జిల్లా.