తప్పిపోయిన బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు మియాపూర్ పోలీసులు. మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూ కాలనీకి చెందిన రాజేష్ కొడుకు సిద్ధార్థ్ (5) ఈరోజు ఉదయం ఇంటి బయట ఆడుకుంటూ ఒక కిలోమీటర్ దూరం వెళ్లి తప్పిపోయాడు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మియాపూర్ పోలీసులు బాలుడిని గుర్తించి రెండు గంటల పాటు శ్రమించి తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బాలుడి ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్న నేపథ్యంలో పోలీసులే ముందస్తుగా తమ బాబును గుర్తించి వారికి క్షేమంగా అప్పగించడం పై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
TELANGANA HYDERABAD
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ