లోక్‌సభ స్పీకర్ అంటే ఇంతకు ముందు తనకు చాలా గౌరవం ఉండేదని, కానీ గత సమావేశాల్లో తొలిసారి విపక్ష నేతను మాట్లాడనివ్వలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. చాలా అంశాల్లో మోదీ రాజీ పడ్డారని ఇంతకుముందే చెప్పానని, ప్రధాని మోదీ వైఫల్యాలపై మాట్లాడడానికి స్పీకర్ అనుమతించడం లేదని రాహుల్ అన్నారు కాగా, లోక్‌సభలో రాహుల్ ప్రసంగంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఎప్పుడూ, ఏ విషయంలోనూ రాజీ పడలేదని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ప్రచురించని పుస్తకం గురించి సభలో మాట్లాడడంతోనే వివాదం మొదలైందని, స్పీకర్‌ను రాహుల్ చాలాసార్లు అవమానించారని అన్నారు. స్పీకర్‌పై అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో గతంలో నెహ్రూ కూడా చెప్పారని, ఆరోపణలకు రుజువులు ఉంటేనే స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాలని రవిశకంర్ ప్రసాద్ సూచించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతలకు మాట్లాడే అవకాశం చాలా ఎక్కువగా లభించిందని అన్నారు.రవిశంకర్ వ్యాఖ్యలకు ఆ తర్వాత రాహుల్ కౌంటర్ ఇచ్చారు . లోక్‌సభ అనేది ఒక నేతకు లేదా ఒక పార్టీకి సంబంధించినది కాదని, దేశం మొత్తానికి సంబంధించినదని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడు మాట్లాడదామనుకున్నా, స్పీకర్ తగిన సమయం కేటాయించలేదని విమర్శించారు. ఓం బిర్లా వ్యక్తిగతంగా మంచి వారేనని, అయితే ఆయన చేతులు కట్టేసి ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో ఎవరూ నిష్పక్షపాతంగా పని చేయలేరని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు. హోం మంత్రి అమిత్ షా ఎన్నో సార్లు స్పీకర్ గదిలోకి వెళ్లి సూచనలు చేశారని తెలిపారు.
NATIONAL
ప్రధాని మోదీ వైఫల్యాలపై మాట్లాడడానికి స్పీకర్ అనుమతివ్వలేదు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ