• Other News
  • Live TV
  • అబ్ర‌హం లింక‌న్ యుద్ధ నౌక‌కు ఏమైంది?

    Reporter
    Journalist Chinna Telangana  |  March 13, 2026, 11:32 am
     అబ్ర‌హం లింక‌న్ యుద్ధ నౌక‌కు ఏమైంది?

    వాషింగ్ట‌న్: ఇరాన్‌పై యుద్ధంలో భాగంగా అమెరికా ద‌ళాలు ఆప‌రేష‌న్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగిస్తున్నాయి. అయితే అగ్ర రాజ్యానికి చెందిన యుద్ధ నౌక అబ్ర‌హం లింక‌న్‌()పై దాడి చేసిన‌ట్లు ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పేర్కొన్నది. ఓ బాలిస్టిక్ క్షిప‌ణితో అబ్ర‌హం లింక‌న్ యుద్ధ నౌక‌ను దెబ్బ‌తీసిన‌ట్లు ఐఆర్జీసీ వెల్ల‌డించింది. దీంతో గ‌ల్ఫ్ స‌ముద్ర జ‌లాల నుంచి ఆ యుద్ధ నౌక విర‌మించుకున్న‌ట్లు ఇరాన్ ప్ర‌క‌టించింది. కానీ అమెరికా ప్ర‌భుత్వం మాత్రం దీన్ని ఖండించింది. ఆప‌రేష‌న్ ఎపిక్ ఫ్యూరీకి త‌మ యుద్ధ నౌక సేవ‌లు అందిస్తున్న‌ట్లు అమెరికా పేర్కొన్న‌ది. యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ త‌న సోష‌ల్ మీడియా పోస్టులో ఈ విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసింది.అబ్ర‌హం లింక‌న్ యుద్ధ నౌక‌కు చెందిన కొన్ని ఫోటోల‌ను పోస్టు చేసింది. ఇరాన్‌కు చెందిన ఓ నౌక .. అబ్ర‌హం లింక‌న్ యుద్ధ నౌక‌కు సమీపంగా వ‌చ్చింద‌ని, అప్పుడు అమెరికా ద‌ళాలు దాన్ని ఫైర్ చేశాయ‌ని ఓ మీడియా క‌థ‌నాన్ని రాసింది. కానీ షిప్‌కు ఏమైంద‌న్న దానిపై క్లారిటీ లేదు. ఇరాన్ స‌ముద్ర జ‌లాల స‌రిహ‌ద్దుల‌కు సుమారు 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న సీ ఆఫ్ ఒమ‌న్‌లో యూఎస్ఎస్ అబ్ర‌హం లింక‌న్ యుద్ధ‌నౌక‌ను త‌మ క్షిప‌ణులు, డ్రోన్లు అటాక్ చేశాయ‌ని ఇరాన్ సెంట్ర‌ల్ హెడ్ క్వార్ట‌ర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. త‌మ ఎదురుదాడి వ‌ల్ల అమెరికా నౌక వేగంగా పారిపోయిన‌ట్లు ఇరాన్ ప్ర‌భుత్వ టీవీ వెల్ల‌డించింది.

    📰 e-Paper Clip
    Google News Follow