బాగ్దాద్: అమెరికా విమానం గురువారం రాత్రి ఇరాక్‌లో కూలింది. ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ కన్ఫర్మ్ చేసింది. మిలిటరీకి చెందిన కేసీ-135 రీఫ్యూయలింగ్ విమానం కూలినట్లు అధికారులు ద్రువీకరించారు. ఈ ఘటనలో రెండు విమానాలు భాగస్వామ్యమైనట్లు తెలుస్తోంది. అయితే శత్రు దేశం కానీ, ఫ్రెండ్లీ ఫైరింగ్ కానీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ ఇరాక్‌లో ప్రస్తుతం రెస్క్యూ ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అయితే ఇదే ఘటనలో భాగస్వామ్యమైన మరో విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు అధికారులు ఓ ప్రకటనలో చెప్పారు.
కేసీ-135 విమానం ఎందుకు కూలిందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇది కేవలం రీఫ్యుయలింగ్ విమానం మాత్రమే. అంటే ఇతర విమానాలకు గాలిలోనే ఇంధనాన్ని నింపుతుంది. అయితే బహుశా గగనతలంలోనే ఏదైనా ఢీకొని ఉంటుందని అంచనా వేస్తున్నారు. రీఫ్యూయలింగ్ విమానాలు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. సుదీర్ఘ దూరం ప్రయాణించే యుద్ధ విమానాలు, బాంబర్లకు రీఫ్యూయలింగ్ విమానాలు ఇంధనాన్ని అందజేస్తాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. భారీ లాజెస్టికల్ ఆపరేషన్‌గా దీన్ని గుర్తించారు. ప్రస్తుత సమయంలో యుద్ధ విమానాలు అధిక సంఖ్యలో గాలిలో విహరిస్తున్నాయి. ఈ దశలో రీఫ్యూయలింగ్ కూడా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఆ టెన్షన్‌లో అనుకోని ప్రమాదం ఏదైనా జరగడం వల్ల ఆ రీఫ్యూయలింగ్ విమానం కూలి ఉంటుందని భావిస్తున్నారు.
INTERNATIONAL
ఇరాక్‌లో కూలిన అమెరికా రీఫ్యుయలింగ్ విమానం
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రసాయన శాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. ఖాజా ఆరిఫ్ కి, రసాయన శాస్త్రంలో పి.హెచ్.డి. పట్టా
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
దోస్త్ మిల్గయా పోరాట యోధునికి ములుగు జిల్లా స్వాగతం సుస్వాగతం పలుకుతోంది