ఒడిశా: ఒడిశాలోని కటక్ ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 10 మంది రోగులు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుంటుబాలకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 2:30 నుంచి 3 గంటల సమయంలో ఐసీయూలోని ట్రామా కేర్ డిపార్ట్మెంట్లో తొలుత మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, రోగుల బంధువుల సహాయంతో ఐసీయూలో ఉన్న రోగులను ఇతర వార్డులకు తరలించారు. ఈ ప్రక్రియలో మొత్తం 23 మంది రోగులను ఇతర విభాగాలకు మార్చారు. రోగులను రక్షించే ప్రయత్నంలో 11 మంది ఆసుపత్రి సిబ్బందికి గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఏడుగురు రోగులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఇతర వార్డులకు తరలించే సమయంలో కాలిన గాయాలు లేదా ఊపిరి ఆడక మరణించారు.
NATIONAL
ఆస్పత్రి ICUలో భారీ అగ్నిప్రమాదం- 10 మంది రోగులు మృతి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ