పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ విమానయాన రంగంపై ప్రభావం చూపుతున్నాయి. డ్రోన్లు, క్షిపణుల దాడులతో పరిస్థితులు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) కీలక అడ్వైజరీ జారీ చేసింది.ఆ అడ్వైజరీ ప్రకారం, పశ్చిమాసియాలోని తొమ్మిది దేశాల గగనతలాన్ని భారత విమానయాన సంస్థలు పూర్తిగా నివారించాలని స్పష్టం చేసింది. నో-ఫ్లై జోన్‌గా ప్రకటించిన ఈ జాబితాలో ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఏ ఎత్తులోనైనా విమానాలు ప్రయాణించకూడదని డీజీసీఏ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.పరిస్థితి మరింత ఉద్రిక్తంగా!ప్రస్తుతం జరుగుతున్న సైనిక దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఈ ప్రాంత గగనతలం పౌర విమానాలకు అత్యంత ప్రమాదకరంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని లక్ష్యాలపై దాడులు జరిపిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించడంతో, యుద్ధ ముప్పు పెరిగింది.మాన సర్వీసులను నిలిపివేయడం సాధ్యం కాదుఈ పరిస్థితుల్లో, భారత విమానయాన సంస్థలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని డీజీసీఏ సూచించింది. నో-ఫ్లై జోన్‌గా పేర్కొన్న దేశాల గగనతలాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలని ఆదేశించింది. అయితే, భారత్ నుంచి యూరప్, ఇతర పశ్చిమ దేశాలకు వెళ్లే విమానాలకు ఈ మార్గం కీలకం కావడంతో, పూర్తిగా విమాన సర్వీసులను నిలిపివేయడం సాధ్యం కాదని గుర్తించింది.32,000 అడుగుల ఎత్తులో మాత్రమేఈ నేపథ్యంలో, సౌదీ అరేబియా, ఒమన్ గగనతలాల వినియోగానికి కొన్ని షరతులతో మినహాయింపులు ఇచ్చింది. ఈ రెండు దేశాల గగనతలంలో ప్రయాణించే విమానాలు కనీసం 32,000 అడుగుల ఎత్తులో మాత్రమే ప్రయాణించాలని ఆదేశించింది. దీనికంటే తక్కువ ఎత్తులో ప్రయాణిస్తే భూమి నుంచి ప్రయోగించే క్షిపణుల పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
NATIONAL
ఆ 9 దేశాల గగనతలాల్లోకి భారత విమానాలు వెళ్లొద్దు- డీజీసీఏ అడ్వైజరీ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ