పాకిస్థాన్ :పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కు చెందిన ఓ ఉద్యోగిని అరెస్ట్ చేశారు. నిందితుడికి పాకిస్థాన్ హ్యాండ్లర్‌లతో విస్తృత పరిచయాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలడంతో రాజస్థాన్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ కేసు దర్యాప్తులో తీగ లాగితే.. ఈ గూఢచర్యం విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన జబరా రామ్ ) ను ఓ కేసులో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.అతడిని ప్రశ్నించగా పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సంబంధం ఉన్న సుమిత్ కుమార్ గురించి తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన 36 ఏళ్ల సుమిత్.. అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లాలో చబువా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో మల్టీ టాస్కింగ్ వింగ్‌లో పనిచేస్తున్నాడు. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని భారత వాయుసేనకు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్థాన్‌కు అందించినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బు కోసం అతడే ఈ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్ హ్యాండ్లర్లకు షేర్ చేసినట్టు గుర్తించారు.సుమిత్‌ను అరెస్ట్ చేసేందుకు రాజస్థాన్ ఇంటెలిజెన్స్‌తోపాటు ఎయిర్‌ఫోర్స్ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నాయి. అరెస్ట్ అనంతరం దర్యాప్తు కోసం నిందితుడిని జైపుర్ తరలించారు. నిందితుడికి 2023 నుంచి పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. వారి నుంచి డబ్బు తీసుకొని.. యుద్ధ విమానాలు, క్షిపణుల వ్యవస్థ, వాటి స్థానం, ఎయిర్‌ఫోర్స్ అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్ హ్యాండ్లర్లకు చేరవేసినట్టు తేలింది.
INTERNATIONAL
పాకిస్థాన్‌కు గూఢచర్యం.. భారత వాయుసేన ఉద్యోగి అరెస్ట్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి గణేష్
వార్త పత్రిక: గండిపేట్ బండ్లగూడ జాకీర్ 122 వ డివిజన్
బంగ్లాదేశ్‌లో మరో దారుణం.. పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
వీణా విద్వాంసురాలు శ్రీవాణిని కలిసిన న్యాయవాద దంపతులు
రూ.15 లక్షల లంచం ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ఎస్ఈ