• Other News
  • Live TV
  • ప్రపంచ మార్కెట్​లో విశ్వసనీయ సెమీకండక్టర్​ సప్లయర్​గా భారత్​ : ప్రధాని మోదీ

    Reporter
    Journalist Chinna Telangana  |  March 31, 2026, 5:14 pm
    ప్రపంచ మార్కెట్​లో విశ్వసనీయ సెమీకండక్టర్​ సప్లయర్​గా భారత్​ : ప్రధాని మోదీ

    దేశంలోని ప్రతి ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా గత బడ్జెట్లో తాము సెమీకండక్టర్​ మిషన్​ 2ను ప్రారంభించామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని సనంద్‌లో కైనెస్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపచం సెమీకండక్టర్ సప్లై చైన్​లో ఒక భారతీయ కంపెనీ చేరడం చాలా గర్వకారణమని అన్నారు.

    ప్రపంచ మార్కెట్లో విశ్వసనీయ సెమీకండక్టర్ సరఫరాదారుగా భారత్​ తన పాత్రను బలోపేతం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కొవిడ్​-19 మహమ్మారి సమయంలో సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు, భారత్ సెమీకండక్టర్ తయారీకి కేంద్రంగా మారాలని మా ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకే భారత్​ 2021లో సెమీకండక్టర్ మిషన్​ను ప్రారంభించిందని ఆయన అన్నారు. అయితే ఇది కేవలం ఒక పారిశ్రామిక విధానం మాత్రమే కాదని, భారతదేశ ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు మార్పులకు భారత్ కేవలం ఒక సాక్షిగా కాకుండా, ఆ మార్పునకు నాయకత్వం వహించే సంకల్పంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow