• Other News
  • Live TV
  • GO 7 వెంటనే రద్దు చేయాలి: అశ్రఫ్ గారు డిమాండ్

    Reporter
    Journalist Chinna Telangana  |  May 4, 2026, 3:39 pm
    GO 7 వెంటనే రద్దు చేయాలి: అశ్రఫ్ గారు డిమాండ్

    తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్య మరింత తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో, BC, SC, ST JAC నాయకులు అశ్రఫ్ గారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ₹10,000 కోట్లకు పైగా ఫీజు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ పరిస్థితిలో GO 7 తీసుకురావడం పేద విద్యార్థులపై తీవ్రమైన అన్యాయం అని పేర్కొన్నారు.
    విద్య మా హక్కు… ఇది ప్రభుత్వ అనుగ్రహం కాదు” అని ఆయన స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సక్రమంగా అమలు చేయకపోతే BC, SC, ST మరియు మైనారిటీ విద్యార్థులు చదువు మానేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

    అశ్రఫ్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ,
    👉 GO 7 వెంటనే వెనక్కి తీసుకోవాలని
    👉 పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని
    👉 విద్యార్థుల విద్యను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

    చివరగా, విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ప్రయోగాలు చేయవద్దని, అవసరమైతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు.

    📰 e-Paper Clip
    Google News Follow