• Other News
  • Live TV
  • ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

    Reporter
    Journalist Chinna Telangana  |  May 4, 2026, 5:14 pm
    ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

    చౌటుప్పల్, మే 04,(వార్త పత్రిక
    రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులబూరుగుకృష్ణారెడ్డి డిమాండ్ చౌటుప్పల్ మండలం కేంద్రంలో చిన్న కొండూరు పెద్ద కొండూరు మందల్లగూడెం, నేలపట్ల,జై కేసారం,ఎస్ లింగోటం,పంతంగి, అంకిరెడ్డిగూడెం,తాళ్ల సింగారం,ధర్మోజిగూడెం, చౌటుప్పల్ రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం జరిగినది.ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి,మార్కెట్ దోపిడిని అరికట్టాలి,నాణ్యమైన ధాన్యాన్ని ఏ గ్రేడ్ గా కొనుగోలు చేయాలి,మిల్లర్ల దోపిడిని అరికట్టాలు, రైతులకు మార్కెట్లలో మంచినీళ్లు కరెంటు మరియు వాచ్మెన్ మరియు పట్టాలు ఏర్పాటు చేయాలి ఒక్కొక్క సెంటర్లలో 70 నుండి 80 వేల బస్తాల ధాన్యం నిల్వ ఉన్నది ఇప్పటికి కొనుగోలు సెంటర్లలో ప్రారంభమైన రోజు నాటి నుండి ఈరోజు వరకు 20 రోజులు నడుస్తున్న 2000 నుండి 3000 వరకు ధాన్యం బస్తాలు కొనుగోలు జరిగినది ఇదేవిధంగా కొనుగోలు జరిగితే ఒక్కొక్క మార్కెట్ ధాన్యం పూర్తయ్యేసరికి మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతున్నది కావున ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేగవంతం చేసి రోజుకు మూడు నుంచి నాలుగు లారీల ధాన్యం కొనుగోలు జరిగినట్లయితే రైతులకు ఇబ్బంది జరగకుండా ఉంటది లేనిచో వర్షాలు పడి రైతులు అనేక ఇబ్బందులు పడవలసి వస్తది కావున ఇట్టి సమస్యలపై ఈరోజు రైతులు రైతు సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డిఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు చీరిక అలివేలు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా,జిఎంపిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ,రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు పొట్ట శ్రీను, రైతు సంఘం మండల నాయకులు ఆకుల ధర్మయ్య, చప్పిడి రాఘవరెడ్డి, జిఎంపిఎస్ మండల కార్యదర్శి కొండే శ్రీశైలం,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బోరం నర్సిరెడ్డి,మంద బుచ్చిరెడ్డి, బొడ్డు అంజిరెడ్డి,గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఆదిముల్లా నందీశ్వర్,ఎలక రాజు యాదగిరి,ఇట్టబోయిన శేఖర్, యాట ముత్యాలు,భీమనలోని బాలరాజు,చీమ కళ్ళ రామచంద్రం,సెట్టయ్య, బొమ్మకంటి కృష్ణ,జక్కడి గోపాల్ రెడ్డి,అంజిరెడ్డి రమణారెడ్డి,దేవేందర్ రెడ్డి, బాల్ రెడ్డి,గూడూరు బాల్ రెడ్డి,పర్ని ధర్మారెడ్డి తదితరులు రైతులు పాల్గొన్నారు

    📰 e-Paper Clip
    Google News Follow